Jagan: నాపై తప్పుడు ప్రచారం చేసినవారికి లీగల్ నోటీసులు..! 23 d ago
అదానీపై నమోదైన కేసులో తన పేరు ఎక్కడా లేదని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినవారిపై 100 కోట్ల పరువునష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. సీఎంలు పారిశ్రామికవేత్తలను కలుస్తారని..ఐదేళ్లకాలంలో తాను అదానీని అనేకసార్లు కలిశానని చెప్పారు. అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు సంబంధం లేదని స్పష్టం చేసారు. తనపై తప్పుడు ప్రచారం చేసినవారికి లీగల్ నోటీసులు ఇస్తానని అన్నారు.